విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ‘ఉన్నతి విద్య’ దోహదం : కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు సర్వతోముఖాభివృద్ధికి ‘ఉన్నతి విద్య’ కార్యక్రమం (Unnathi Vidya Program) దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మసూద్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలక్‌మందిర్) పీఎం శ్రీ పాఠశాలలో ‘ఉన్నతి విద్య’ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉన్నతికి బాట.. విద్యతో ప్రయాణం – అభ్యసనం, అభివృద్ధి, విజయం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు.

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు పటిష్టమైన విద్యా పునాది కల్పిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుని నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

అనంతరం కలెక్టర్ పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యాంశాలపై వారి అవగాహనను పరీక్షించడంతో పాటు బోధనా విధానాలు, పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాధవి, సెక్టోరల్ అధికారులు లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>