డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని మొహబ్బెవాలా ప్రాంతంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం (Dehradun Accident) చోటుచేసుకుంది. యూరియా లోడుతో వెళ్తున్న ఒక కంటైనర్ లారీ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారుని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి లారీ ఒక్కసారిగా కారుపైనే పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

మృతులను మిశ్రా కపూర్, ఆయన భార్య నిషా ఆనంద్, తల్లి కిరణ్ కపూర్, నీరజ్‌గా గుర్తించారు. వీరంతా దీపావళి షాపింగ్ పూర్తి చేసుకుని ఉత్తరప్రదేశ్ లోని సహారన్‌పూర్‌కు తిరిగి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరేళ్ల బాలుడు మహేర్ కపూర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>