గడువులోగా ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల (Primary Health Sub Centre) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులతో మంజూరైన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మంజూరైనప్పటికీ ఇంకా ప్రారంభం కాని పనులకు సంబంధించి కారణాలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే ప్రారంభమైన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

డిజిటల్ గవర్నెన్స్‌పై సిబ్బందికి అవగాహన కల్పించాలి..

అనంతరం జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించారు. డిజిటల్ గవర్నెన్స్ విధానంపై సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి డిజిటల్ గవర్నెన్స్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ విధానం ద్వారా పరిపాలనలో పారదర్శకత పెరగడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను కాగిత రహితంగా నిర్వహించేందుకు వీలవుతుందని తెలిపారు. డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, ఈఈ (పంచాయతీరాజ్) తుకారాం, జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ, పే అండ్ అకౌంట్స్ అధికారి చంద్రశేఖర్, ఎస్టీఓ రమేష్, మాస్టర్ ట్రైనర్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఎన్నికల కమిషనర్ల పదవీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>