ఆపదలో ఉన్న కుటుంబానికి ఎల్‌హెచ్‌పీఎస్ నాయకుల అండ!

కలం, కారేపల్లి : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, కష్టకాలంలో చేయూతనివ్వడమే నిజమైన మానవత్వమని చాటుతూ ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు (LHPS Leaders) సేవా కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిమన తండాకు చెందిన గుగులోత్ వెంకటేష్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాగా, గురువారం నిర్వహించనున్న దశదిన కర్మల నేపథ్యంలో కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. కష్ట సమయంలో బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం అందించి సేవా నిరతిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ సింగరేణి మండల అధ్యక్షుడు గుగులోత్ నరేష్ నాయక్, ఉపాధ్యక్షుడు గుగులోత్ ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ.. సమాజంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సేవా కార్యక్రమాలు కేవలం సహాయం అందించడమే కాకుండా సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సహాయం అందించినప్పుడే నిజమైన మానవత్వం వెలుగులోకి వస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర భేరి రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు బాధావత్ అనిత బాయి, ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షుడు ఆంగోత్ రవి నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి అజ్మీర నాగేశ్వరరావు నాయక్, సింగరేణి మండల అధ్యక్షుడు గుగులోత్ నరేష్ నాయక్, ఉపాధ్యక్షుడు గుగులోత్ ప్రసాద్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర కిషోర్ నాయక్, బాధావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>