అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, బైంసా : అర్హులైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇళ్లు (Double Bedroom Houses) కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం భైంసా మండలం మాటేగాం గ్రామంలో కలెక్టర్ పర్యటించి, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఇళ్లకు సంబంధించిన రికార్డులు, లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం భైంసా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

స్థల విస్తీర్ణం, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థలానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, తదుపరి చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో నీరజ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>