హైదరాబాద్‌లో అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad) లో అంతర్జాతీయ సైబర్ మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్ (Fake Call Centre) ముఠా గుట్టును ఈడీ అధికారులు రట్టు చేశారు. హర్షల్ రావల్ నేతృత్వంలోని ఈ ముఠా గత మూడేళ్లుగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. హర్షల్ రావల్ (Harshal Raval) తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు తెరలేపాడు. పోలీసులు దాడులు చేయడంతో తన కార్యకలాపాలను పంజాబ్‌లోని పాటియాలాకు మార్చి అక్కడ మరో కాల్ సెంటర్ ప్రారంభించాడు. అక్కడి నుంచి కూడా అమెరికా పౌరులను మోసం చేస్తూ అక్రమ సంపాదన కొనసాగించాడు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్షల్ రావల్‌తో పాటు ప్రణవ్ పితాదియా, చేతన్ ముంజల్‌ను ఈడీ అధికారులు పాటియాలాలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణలో వేలాది మంది అమెరికా పౌరులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్లు వెల్లడైంది. మోసాల ద్వారా సంపాదించిన డబ్బును తరలించేందుకు వందల సంఖ్యలో మ్యూల్ బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అమెరికా నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బులు స్వీకరించి, హవాలా మార్గాల్లో నగదును బదిలీ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం(Fake Call Centre)లో సుమారు రూ.400 కోట్ల మేర క్రిప్టో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఠా ఆర్థిక లావాదేవీలు, ఇతర నిందితుల పాత్రపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Also Read : పార్కు భూమికి ఫార్మా కంపెనీ ఎసరు.. రూ.7 కోట్ల స్థలం కబ్జా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>