వలిగొండ బస్టాండ్‌ అభివృద్ధి చేయాలని వినతి

కలం, వలిగొండ: వలిగొండ బస్టాండ్‌ అభివృద్ధి అభివృద్ధికి సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil) కోరారు. మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వలిగొండ బస్టాండ్‌ ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని విన్నవించారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>