సీఎం రేవంత్ కొడంగల్ పర్యటనపై కలెక్టర్ సమీక్ష

కలం, నారాయణపేట: కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలోని హకీంపేటలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు రైతు మేళా కార్యక్రమం జరగబోతుందని కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారని.. నారాయణపేట జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రైతులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రియాంక సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు మేళాకు మండలాల వారీగా రైతులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి సమన్వయ బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు..

రైతులకు రవాణా సౌకర్యంతో పాటు ప్రయాణ ఏర్పాట్లు, భోజన వసతి తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక (Collector Priyanka) సూచించారు. మేళాకు వెళ్లే బస్సుల వివరాలు, బయలుదేరే సమయాలు, నిర్ణయించిన పికప్ పాయింట్లు, రైతుల సంఖ్య తదితర వివరాలను సంబంధిత యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. లైజనింగ్ అధికారులు బస్సుల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ బస్సులు బయలుదేరినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ఫణి కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ పాల్గొన్నారు.

Also Read : ఈఆర్సీ హియరింగ్‌లో ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>