భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, ముధోల్ : భూముల రీ సర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా నిర్వహించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ( Nirmal Collector) అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ మండలం చందాపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మొత్తం పట్టా భూముల విస్తీర్ణం, సాగునీటి వసతులు ఉన్న భూములు, ఇతర భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా భూ హద్దులను కచ్చితంగా గుర్తించాలని సూచించారు. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రీ సర్వే చేపట్టాలని తెలిపారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ శ్రీలత, సర్వే అధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>