బోనం సమర్పించి NHM ఉద్యోగుల నిరసన

కలం, నాగర్‌కర్నూల్: జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె (NHM Employees Strike) మంగళవారం 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో ఉద్యోగులు పోచమ్మ తల్లికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించి, 78 కేడర్ల ఉద్యోగులను క్రమబద్ధీకరించేలా ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు.

ఈ సందర్భంగా NHM జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన తాము.. కుటుంబాల భవిష్యత్తు కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌ఛార్జి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా.బాలకృష్ణ, శ్రీనివాసులు, హైమవతి, డా.జగన్, ప్రవీణ్, భీముడు, ప్రకాష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>