కలం, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందుల (Pulivendula) మున్సిపల్ పీఠాన్ని తొలిసారిగా తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలను 13,875 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సాధించారు.
పులివెందుల మున్సిపాలిటీ (Pulivendula Municipality) పరిధిలోని మొత్తం 40 వార్డుల్లో కూటమి ఏకపక్షంగా తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. టీడీపీ ఏకంగా 34 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలైన బీజేపీ 2 స్థానాలను, జనసేన 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. దీంతో మొత్తం 37 స్థానాలు కూటమి ఖాతాలో పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 3 వార్డులకు మాత్రమే పరిమితమైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని కోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో కూటమి సాధించిన ఈ ఊహించని విజయం రాష్ట్ర రాజకీయంలో సంచలనంగా మారింది. ఈ విజయాన్ని టీడీపీ శ్రేణులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. పులివెందుల పీఠం కైవసంతో కూటమి శ్రేణులలో సంబరాలు అంబరాన్నంటాయి.
Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు
Follow Us On: X(Twitter)

