శిక్షణ అనుభవాలను కలెక్టర్‌తో పంచుకున్న హరి ప్రసాద్

కలం, ఆదిలాబాద్: కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనింగ్) ఎన్.హరి ప్రసాద్ (Assistant Collector Hari Prasad) మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను (Collector Rajarshi Shah) ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు హరి ప్రసాద్ పూల మొక్కను అందజేశారు. జిల్లా పరిపాలన, పాలనాపరమైన అంశాలు, క్షేత్రస్థాయి శిక్షణ అనుభవాలపై ఇరువురూ చర్చించారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ప్రసాద్‌ను అభినందించిన జిల్లా కలెక్టర్, శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించే అధికారిగా రాణించాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>