కలం, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ మైదానంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రత్యర్థి గోల్‌కీపర్‌తో జరిగిన భీకర ఢీకొట్టిన ఘటనలో గాయపడిన స్పెయిన్ ఆటగాడు జీసస్ డి మిగెల్ (30) కన్నుమూశాడు. మంగళవారం ఉదయం 8 గంటలకు అతడు మరణించినట్లు టెనెరిఫే క్లబ్ ప్రకటించింది. స్పెయిన్ రెండో డివిజన్లో టెనెరిఫే, ఎఫ్‌సీ అండోరా జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఆట చివరి దశలో బంతి కోసం వెళ్తున్న డి మిగెల్(Jesus De Miguel)ను అండోరా గోల్‌కీపర్ జీసస్ ఓవోనో బలంగా ఢీకొట్టాడు. దీంతో డి మిగెల్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోనే అతడికి చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో డి మిగెల్(Jesus De Miguel)కు గుండె ఆగిపోయినట్లు స్పెయిన్ మీడియా వెల్లడించింది. వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేసినప్పటికీ, అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. తమ ఆటగాడి మరణంతో టెనెరిఫే క్లబ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సంతాపం తెలిపింది.
Also Read : ఐపీఎల్ ఎంట్రీపై మాజీ పాకిస్తాన్ పేసర్ క్లారిటీ..!
Follow Us On: X(Twitter)

