ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్.. రూ.29 లక్షలు స్వాహా!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ సైబర్ నేరగాళ్ల (Cyber Fraud) బారిన పడి భారీగా డబ్బులు నష్టపోయారు. ‘సుకన్య రెడ్డి’ పేరుతో ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక ఫేక్ అకౌంట్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను కానిస్టేబుల్ అంగీకరించారు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకున్న సదరు మహిళ, ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికింది.

బాధితుడు మొదట ‘డార్విన్ ఎక్స్ గ్లోబల్’ అనే సంస్థలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగా, లాభాలు వచ్చినట్లు యాప్‌లో చూపించి అతనికి నమ్మకం కలిగించారు. దీంతో నిజమేనని నమ్మిన కానిస్టేబుల్ వివిధ విడతల్లో మొత్తం రూ.29.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత ట్రేడింగ్ ఖాతాలో రూ.76 లక్షల లాభం వచ్చిందని, ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే అదనంగా రూ.12 లక్షల ఫీజు చెల్లించాలని చెప్పడంతో తాను మోసపోయానని సదరు కానిస్టేబుల్ గ్రహించారు. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>