విద్యార్థులకు సమతుల్య ఆహారం అందించడమే లక్ష్యం : కవ్వంపల్లి

కలం, కరీంనగర్​: విద్యార్థులకు సమతుల్య ఆహారం అందించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) తెలిపారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అల్పాహార పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభ్యాసానికి మేలు కలుగుతుందన్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో సమయపాలన అలవడటంతోపాటు పాఠశాలలకు హాజరు శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని కవ్వంపల్లి (MLA Kavvampally Satyanarayana) సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, మండల తహసీల్దార్, ఎంపీడీవోతోపాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్, పీఏసీఎస్ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, గోపు తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ చెన్నబోయిన రవి, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>