కలం, వెబ్ డెస్క్ : అక్రమ మద్యం రవాణా కేసులో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో నమోదైన కేసు ఆధారంగా ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 4న హైదరాబాద్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. మద్యం వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 4న హైదరాబాద్లో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు అంబటి రాంబాబు సిద్ధమవుతున్నారు.
Also Read : కుప్పం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఆందోళన!
Follow Us On : WhatsApp

