కలం, వెబ్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. చైనా సంస్థ బైట్‌డాన్స్ అధినేత జాంగ్ యిమింగ్ను వెనక్కి నెట్టి రికార్డు సృష్టించారు. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 12 శాతం పెరగడంతో అంబానీ సంపద ఒక్కరోజులోనే 8.5 బిలియన్ డాలర్లు (రూ.80 వేల కోట్లకు పైగ)పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర సంపద 88.8 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా పేర్కొంది.
రిలయన్స్ కంపెనీస్ త్రైమాసిక ఆదాయం విశ్లేషకుల అంచనాలను మించి నమోదవడంతో కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ చోటుచేసుకుంది. కంపెనీ 255.5 బిలియన్ రూపాయల ఆదాయాన్ని ప్రకటించారు. దీంతో రిలయన్స్ మార్కెట్ విలువకు 19 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. సోమవారం జరిగిన పరిణామాలతో అంబానీ (Mukesh Ambani) సంపద 10.5 శాతం పెరిగి 88.8 బిలియన్ డాలర్లకు చేరింది. పెరిగిన సంపదతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముఖేశ్ అంబానీ 23 స్థానానికి చేరుకుని ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

