బిర్యానీ తిని వస్తుండగా ప్రమాదం.. యువకుడు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) మండలం కిష్టారం ఓసీ-జీఎం కార్యాలయం మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కుర్సం తిరుపతయ్య, అచ్చమ్మ దంపతుల కుమారుడు రాము (25), అదే గ్రామానికి చెందిన పద్దం రాధాకృష్ణ, కాకా నరసింహారావు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం గ్రామంలో వాలీబాల్ ఆడిన అనంతరం ముగ్గురూ కలిసి సత్తుపల్లికి వచ్చి బిర్యానీ తిన్నారు. ​అనంతరం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కిష్టారం ఓసీ-జీఎం కార్యాలయం మధ్యలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Road Accident)లో రాము అక్కడికక్కడే మృతి చెందగా, రాధాకృష్ణ, నరసింహారావులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మం తరలించినట్లు సమాచారం. కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>