కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భేటీ అయ్యారు. కుమారుడు, హీరో రామ్ చరణ్‌తో కలిసి ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లిన చిరంజీవి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, వెంకటేశ్వరుడి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఉల్లాసంగా చర్చించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా ఢిల్లీలో చిరంజీవి, రామ్ చరణ్ అమిత్ షాను కలుసుకోగా.. అభినందనలు తెలిపారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి హైదరాబాద్ పర్యటనకు రావడంతో మరోసారి కలిశారు. అయితే ఇది మర్యాదపూర్వకంగా భేటీ మాత్రమేనని, రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Also Read : రాప్తాడు ఘటనపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్!
Follow Us On: X(Twitter)

