కలం, మునుగోడు : చండూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పట్టణంలోని అన్ని వీధుల్లో దశలవారీగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు (Kodi Srinivasulu) తెలిపారు. చండూరుపట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం కస్తాల రోడ్డు నుంచి వాసవి మాత దేవాలయం వరకు చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజలతో పాటు వాసవి మాత దేవాలయానికి వచ్చే భక్తులు, వాహనదారులకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, మొగుదాల సత్తమ్మ వెంకన్న, పట్టణ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, ఏకాలపు ఆంజనేయులు, రంగన్ భాయ్ వెంకన్న, నల్ల సత్యనారాయణ, గార్లపాటి వెంకన్న, సముద్రాల వెంకన్న, పులిపాటి ప్రసన్న తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

