బాలికపై లైంగిక దాడి కేసు.. దోషికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

కలం, మధిర: చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి చట్టం ద్వారా సరైన శిక్ష తప్పదని మరోసారి రుజువైంది. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి కఠిన శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు (Madhira POCSO Case)పై విచారణ చేపట్టిన ఖమ్మం రెండో ఫాస్ట్‌ట్రాక్ (పోక్సో) కోర్టు.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

సోమవారం ​పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. మధిర పట్టణానికి చెందిన గడ్డాల అరవింద్ అలియాస్ చిన్ని (35) అనే వ్యక్తి గతంలో ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మధిర పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 65(2), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. ​ఈ కేసును విచారించిన ఖమ్మం రెండో ఫాస్ట్‌ట్రాక్ (పోక్సో) కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పొగడ కృష్ణ అర్జున్.. నేరం నిజమని తేలడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>