ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును (Prajavani Complaints) క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు.

అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని, శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. తీసుకున్న చర్యలు, పరిష్కార వివరాలను నిర్ణీత గడువులోగా ప్రజావాణి పోర్టల్‌(Prajavani Portal)లో నమోదు చేయాలని ఆదేశించారు.

ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని, సమస్యల మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీఏ అధికారి రవీందర్ రాథోడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ: అమిత్ షా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>