సింగరేణి మత్స్య సహకార సంఘంలో ఏకగ్రీవ తీర్పు

కలం, కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం (Singareni Fisheries Society) ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడిగా తురక సాంబయ్య రెండోసారి ఎన్నికయ్యారు. సింగరేణి పెద్ద చెరువు కట్ట మైసమ్మ చింతచెట్టు వద్ద ఎన్నికల అధికారి జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో సొసైటీకి చెందిన 140 మంది సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షుడిగా తురక కోటేశ్వరరావు, కార్యదర్శిగా చింతల సంపత్ ఎన్నిక కాగా, డైరెక్టర్లుగా గిరిపోయిన వెంకన్న, బోళ్ల లచ్చయ్య, తురక రాజు, పేరున గురువులు, తురక లక్ష్మి, గంగారబోయిన జానకమ్మ ఎన్నికయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తురక సాంబయ్యకు సభ్యులు అభినందనలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, సంఘం అభివృద్ధి, సభ్యుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.సభ్యులందరినీ కలుపుకొని సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు గంగారబోయిన సత్యం, దిండి లచ్చయ్య, గంగారబోయిన యాదగిరి, పెద్దమ్మ సత్యం, తురక రవి, ముదిరాజ్ పెద్దమనిషి తురక రాంబాబు, గొడుగు శ్రీనివాస్, ఉడతల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>