కలం, వెబ్ డెస్క్: ఏపీలో విచ్చలవిడిగా గంజాయి వాడకం పెరిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాలికను ఆయన పరామర్శించి, వైద్యులను చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలోకి నిందితుడు ఏకంగా ఎలక్ట్రానిక్ రంపంతో వచ్చి.. బాలికపై అత్యంత దారుణంగా దాడి చేయడం భయానకమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటన చాటి చెబుతోందన్నారు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు..
ఏపీలోని ప్రతి గ్రామం, ప్రతి వీధిలో మద్యం, గంజాయి లభ్యమవుతోందని జగన్ (YS Jagan) ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. 11 గంటల పాటు బాలికకు ఆపరేషన్లు నిర్వహించామని, ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని డాక్టర్లు చెప్పారని జగన్ వివరించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిహారం అందిస్తుందన్నారు. పార్టీ పరంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు.. ఇవేనా ప్రజాస్వామ్య ఎన్నికలు?: విడుదల రజిని
Follow Us On : WhatsApp

