కలం, గోదావరిఖని : రామగుండం నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా పవర్ హౌస్ కాలనీలో (Power House Colony) రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నూతన పార్కును (New Park) సోమవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ (MLA Raj Thakur) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు, చిన్నారులు ఆటలాడుకునేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం దృష్టిలో ఉంచుకొని పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి , డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి RG -1 Gm శ్రీ లలిత్ కుమార్, DyGM Forest కరుణ , Civil DyGmవరప్రసాద్, GM చంద్రశేఖర్ కార్పోరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

