కలం, కరీంనగర్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) కరీంనగర్ పర్యటన అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా పడింది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఆయన కరీంనగర్ (Karimnagar) జిల్లాలో విస్తృతంగా పర్యటించాల్సి ఉన్నప్పటికీ ఊహించని అనివార్య కారణాల చేత ఈ పర్యటనను ముందుకు జరపలేకపోతున్నట్లు పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు.
దీపావళి తర్వాతే కరీంనగర్ ఆగమనం
ఈ సందర్భంగా నితిన్ నబిన్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. దీపావళి పండుగ ముగిసిన వెంటనే కొత్త ఉత్సాహంతో కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొంటానని తెలిపారు. మహా పాదయాత్రకు తానే ముఖ్య అతిథిగా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కరీంనగర్ “మహా పాదయాత్ర”కు తాను స్వయంగా హాజరవుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసి, బీజేపీ బలాన్ని చాటిచెప్పేలా శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ కాషాయ దండు జోష్ చూడాలని ఉంది
కరీంనగర్ అంటేనే బీజేపీకి బలమైన గడప అని నితిన్ నబిన్ కొనియాడారు. అక్కడి కాషాయ దండు చూపే అపారమైన ఉత్సాహాన్ని, కార్యకర్తల బలమైన జోష్‌ను స్వయంగా కళ్లారా చూడాలని ఉందంటూ ఆకాంక్షించారు. అనివార్య కారణాల వల్ల ఈసారి రాకపోయినా.. త్వరలోనే కరీంనగర్ గడ్డపై పర్యటించి కార్యకర్తల్లో మరింత నూతనోత్తేజం నింపుతానని ఆయన పేర్కొన్నారు.

