విజయవాడ చుట్టుగుంటలో భారీ అగ్నిప్రమాదం.. టింబర్ డిపో దగ్ధం!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada Fire) నగరంలోని చుట్టుగుంట ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. స్థానికంగా ఉన్న ఒక టింబర్ డిపోలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డిపోలో నిల్వ ఉంచిన కలప సామగ్రి కారణంగా మంటలు క్షణాల్లోనే నలువైపులా వ్యాపించాయి. దీంతో భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడటంతో పాటు, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను మరింత విస్తరించకుండా అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>