శాతవాహన వ‌ర్సిటీలో ఎల్‌ఎల్‌బీ విద్యార్థిని ఆత్మహత్య

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‎లోని శాతవాహన యూనివర్శిటీ (Satavahana University)లో తీవ్ర విషాదం నెలకొంది. ఎల్‎ఎల్‎బీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‎కు చెందిన చంద్రకళ (24) అనే యువతి శాతవాహన యూనివర్శిటీలో ఎల్‎ఎల్‎బీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం క్యాంపస్ హాస్టల్‎లో చంద్రకళ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. గమనించిన విద్యార్థులు వర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అనంత‌రం అధికారులు స్థానిక పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.

వర్సిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. చంద్రకళ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలో అంతకు ముందు సెల్ ఫోన్ ద్వారా ఫోన్ కాల్‌ మాట్లాడినట్లు ఆమె మెడలో వైర్ లెస్ నెక్ బ్యాండ్స్ కనిపించాయి. మృతురాలి ఫోన్‌ను పరిశీలిస్తోన్న పోలీసులు.. చివరగా ఎవరితో కాల్ మాట్లాడిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>