ఉన్మాదిపై కాల్పులు.. పోలీసుల కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: రాప్తాడు స్కూల్‌లో బాలికపై దాడి (Rapthadu School Attack) చేసిన ఉన్మాది హేమంత్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి అనంతపురం పోలీసులు కీలక ప్రకటన చేశారు. ‘నిందితుడిని పట్టుకోవడానికి 25 బృందాలుగా విడిపోయి సెర్చ్ చేశాం. ఆత్మకూరు అడవుల్లో దాక్కున్నట్లు సమాచారం వచ్చింది. పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కత్తితో దాడికి దిగాడు. రాప్తాడు సీఐకి గాయమైంది. వెంటనే ఆత్మరక్షణ కోసం ఆరు రౌండ్ల కాల్పులు జరిపాం. నిందితుడు కింద పడిపోగానే.. వెంటనే ఆసుప్రతికి తరలించాం. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు’ అని ప్రకటించారు. ఇదిలా ఉంటే, హేమంత్‌ని ప్రస్తుతం ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>