నాటు బాంబు పేలి ఏడుగురికి గాయాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) మండల కేంద్రంలోని ఎర్రమల్ కుచ్చలో నాటు బాంబు పేలింది (Bomb Explosion). ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయ‌ప‌డ్డ వారిలో శ్రీదేవి, అంజలి, రమేష్, రాజు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరు అడవి పందుల వేట కోసం నాటు బాంబులు తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>