బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై బీపీ నాయక్ ఆగ్రహం

కలం, బోనకల్: బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్ రాజు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను బీపీ నాయక్ (BP Naik) తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఖమ్మం జిల్లా బోనకల్ (Bonakal) మండల కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.

తనను వ్యక్తిగతంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన లింగాల కమలరాజు ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మండలంలో అనధికార ఫ్లెక్సీలను తొలగించాలని, గిరిజన మహిళా సర్పంచ్ పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సీనియర్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, పలువురు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>