రాప్తాడు నిందితుడిపై పోలీసుల కాల్పులు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం కలిగించిన రాప్తాడు స్కూల్‌లో (Rapthadu School Attack) బాలికపై రంపంతో దాడి చేసిన ఘటనలో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. హేమంత్ ఆత్మకూరు అడవుల్లో దాక్కున్నట్లు తెలియడంతో పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై రాళ్లతో దాడికి దిగాడు. కత్తితో కూడా దాడికి యత్నించగా.. రాప్తాడు సీఐ వెంకటేశ్‌కు గాయమైంది. అనంతరం పారిపోయేందుకు యత్నించగా.. పోలీసులు జరిపిన ఆరు రౌండ్ల కాల్పుల్లో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శనివారం రాప్తాడు జడ్పీ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై హేమంత్ రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఘటన అనంతరం హేమంత్ పరారయ్యాడు. అతడిని పోలీసులు పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఆత్మకూరు అడవుల్లో దాక్కున్నట్లు పక్కా సమాచారం రావడంతో అదుపులోకి తీసుకురావడానికి వెళ్లగా.. కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>