మలేషియన్‌ గ్రాండ్‌ప్రి మార్క్‌ మార్క్వెజ్‌ సొంతం

క‌లం, స్పోర్ట్స్‌: సెపాంగ్‌ సర్క్యూట్‌పై మార్క్‌ మార్క్వెజ్‌ (Marc Marquez) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. మలేషియన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. ప్రత్యర్థులపై పాయింట్ల ఆధిక్యాన్ని మరింత పెంచుకుని.. వచ్చే వారం ఖతార్‌లోనే ఎనిమిదో మోటోజీపీ ప్రపంచ టైటిల్‌ను ఖరారు చేసుకునే అవకాశాన్ని అందుకున్నాడు. రేసు ప్రారంభంలోనే రెండో స్థానం నుంచి దూసుకొచ్చిన మార్క్‌.. పోల్‌ పొజిషన్‌లో ఉన్న తన సోదరుడు అలెక్స్‌ను వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వెళ్లాడు. మధ్యలో అలెక్స్‌ నుంచి పోటీ ఎదురైనా.. మళ్లీ పట్టు సాధించి చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. పెడ్రో అకోస్టాపై 4.172 సెకన్ల తేడాతో విజయం సాధించాడు.

అకోస్టా రెండో స్థానంలో నిలవగా.. అలెక్స్‌ మార్క్వెజ్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయంతో మార్క్‌ ఖాతాలో 399 పాయింట్లు చేరాయి. గాయంతో మలేషియన్‌ రేసుకు దూరమైన జార్జ్‌ మార్టిన్‌పై 44 పాయింట్లు, ఆరో స్థానంలో నిలిచిన మార్కో బెజ్జెచీపై 67 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. వచ్చే వారం ఖతార్‌ గ్రాండ్‌ప్రిలో మార్టిన్‌పై 30, బెజ్జెచీపై 8 పాయింట్ల ఆధిక్యం సాధిస్తే టైటిల్‌ మార్క్‌ సొంతమవుతుంది. దీంతో సెపాంగ్‌ విజయం అతడిని ఎనిమిదో ప్రపంచ టైటిల్‌కు మరింత చేరువ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>