బైక్, క్రూజ‌ర్‌ ఢీ.. ఇద్దరు యువకులు మృతి!

కలం, అచ్చంపేట: నాగర్‌క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) నియోజకవర్గం శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం (Accident) చోటు చేసుకుంది. బైక్‌, క్రూజర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. చెన్నారం గేటు వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయిచెడి గ్రామంలో మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్న బిజినపల్లి మండలానికి చెందిన యువకులు ఇద్దరు బైకుపై వెళ్తున్నారు. ఈ స‌మ‌యంలో చెన్నారం గేట్ వద్ద క్రూజ‌ర్‌ను ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలై అక్కడిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల‌కు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>