అంబులెన్సులోనే ప్రసవం.. మగ బిడ్డకు జననం

కలం, మామడ: మామడ మండలం వాస్తాపూర్ (Vasthapur) గ్రామానికి చెందిన పి.రజితకు ఆదివారం పురిటినొప్పులు అధికం కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఈఎంటీ సురేష్, పైలట్ హఫీజ్ గ్రామానికి చేరుకుని, పరిస్థితిని గమనించి అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. రజిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, తదుపరి వైద్య చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>