కలం, మహబూబ్‌నగర్: సర్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) మండిపడ్డారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో సర్‌పై నిర్వహించిన మేధావుల సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్‌పై మేధావులతో సుదీర్ఘంగా చర్చించించి, ప్రజల్లో ప్రతిపక్షాలు కల్పిస్తున్నఅనుమానాలు, అపోహలు తొలగించాలని ఎంపీ డీకే అరుణ కోరారు. సర్ పక్రియ దేశంలో ఇప్పుడు తొలిసారి జరగడం లేదని, 1952 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు ఓటరు జాబితా సవరణ జరిగిందని, అందులో అత్యధికంగా కాంగ్రెస్ హయంలోనే చేపట్టారని ఆమె గుర్తు చేశారు.
సర్తోనే కేరళలో అధికారంలోకి వచ్చామని కేరళ హోం మంత్రి రమేష్ చిన్నేతల గతంలో చెప్పారని అయినా ఓర్వలేక నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆమె ఆరోపించారు. గతంలో ఎన్నికల సంఘం కమిషనర్లకు రాజకీయ పదవులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్నిక ల్లో కాంగ్రెస్ ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలను నిందించేవారని, ఇటీవల కర్ణాటకలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ ఓటింగ్‌తో జరిగినా కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేదన్నారు. రాజకీయాల కోసం వ్యవస్థలను తప్పుబట్టడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎల్లప్ప, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రఘురామయ్య, మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ మంజుల, పట్టణ బీజేపీ అధ్యక్షుడు వినోద్, నారాయణ పేట్ జిల్లా ప్రముఖులు, ముఖ్య నేతలు, వివిధ వర్గాల మేధావులు పాల్గొన్నారు.

