బీజేపీలో చేరిన కంటివాడ సర్పంచి

కలం, ఆదిలాబాద్: బీఆర్ఎస్ పార్టీలో ఇటీవలే చేరిన భీంపూర్ మండలం కంటివాడ గ్రామ (Kantiwada Village) సర్పంచి మడావి మాధవ్, ఉప సర్పంచి మడావి మంతు తిరిగి సొంతగూటి బీజేపీలో చేరారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారితో పాటు లింగు పటేల్, మరప ప్రవీణ్, జెంగు మహేందర్, తులసీ రామ్, ప్రభాకర్, అవినాష్ తదితరులతో కలిపి మరో 30 మందికి పైగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా చేరిన వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, తాంసి మాజీ జడ్పీటీసీ తాటిపల్లి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>