ఫెరారీలో హ్యామిల్టన్ ఊచకోత.. మెక్సికో రేసులో నెం.1

క‌లం, స్పోర్ట్స్‌: ఫార్ములా-1 రేసింగ్ రారాజు లూయిస్ హ్యామిల్టన్ (Lewis Hamilton) మెక్సికో ట్రాక్‌పై ఊచకోత కోశారు. ఫెరారీ టీమ్‌లోకి మారిన తర్వాత సరికొత్త జోష్‌తో విరుచుకుపడి తన తొలి సంచలన పోల్ పొజిషన్‌ను కైవసం చేసుకున్నారు. 2023 తర్వాత హ్యామిల్టన్ క్వాలిఫైయింగ్ రేసులో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. అంత్యంత ఉత్కంఠగా సాగిన ఈ అర్హత పోరులో 41 ఏళ్ల హ్యామిల్టన్ దెబ్బకు ప్రత్యర్థులు కొట్టుకుపోయారు. తన మాజీ సహచరుడు జార్జ్ రస్సెల్‌ను కేవలం సెకను తేడాతో వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, ఫెరారీ రేసర్ చార్లెస్ లెకిలర్క్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఇది ఆయన కెరీర్‌లో 105వ పోల్ పొజిషన్ కావడం విశేషం. ఆరంభ ప్రాక్టీస్‌లో ఇంజిన్ సమస్యలు ఇబ్బంది పెట్టినా, అద్భుత వ్యూహంతో రీ-ఎంట్రీ ఇచ్చి రికార్డు సాధించారు. మనసులో పట్టుదల ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ దెబ్బతో 1982 తర్వాత పోల్ పొజిషన్ సాధించిన అత్యంత వయోవృద్ధ డ్రైవర్‌గా హ్యామిల్టన్ చరిత్ర పుటలకెక్కారు. ఆదివారం జరిగే ప్రధాన పోరులోనూ హ్యామిల్టన్ ఇదే విధ్వంసకర ఫామ్‌ను కొనసాగిస్తారని అభిమానులు ధీమాగా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>