బిగ్ అలర్ట్.. తుఫాన్‌గా బలపడిన వాయుగుండం!

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల అర్నబ్ తుఫాన్ తో అతలాకుతం అయిన ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం తుఫాన్‌గా రూపాంతరం చెందింది. దీనికి ‘మురుసు’ (Murasu Cyclone) అని నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుఫాన్ నేరుగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం..ఈ వ్యవస్థ మరింత బలపడి రేపటికల్లా తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

ఈ మురుసు తుఫాన్ ఎల్లుండి నెల్లూరు , నరసాపురం జిల్లాల మధ్య తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం దాటే సమయంలో సముద్రం తీవ్ర అలజడికి గురవుతుందని, తీరప్రాంతాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు రాత్రి నుంచి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. సముద్రంలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నందున వేటకెళ్లిన మత్స్యకారులను వెంటనే ఒడ్డుకు తిరిగి రావాలని హెచ్చరించారు. విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ అయి, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలను సిద్ధం చేస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>