కిలేడీ.. 30 సెకన్లలో రూ.15 లక్షల నగలు చోరీ!

కలం, వెబ్​ డెస్క్​ : ఢిల్లీలోని ఓ నగల దుకాణంలో పట్టపగలే భారీ దొంగతనం (Delhi Jewellery Theft) జరిగంది. ముసుగు ధరించి వచ్చిన ఓ కిలేడీ కేవలం 30 సెకన్లలో సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన ఢిల్లీ కంటోన్మెంట్ సమీపంలోని సుల్తాన్‌పురా మార్కెట్‌లో ఉన్న సచిన్ జ్యువెలర్స్‌లో శనివారం మధ్యాహ్నం జరిగింది. చోరీకి సంబంధించిన దృశ్యాలు షాప్​ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

దుకాణ యజమాని సౌరభ్ అగర్వాల్ వివరాల ప్రకారం.. ముసుగు ధరించిన ఓ మహిళ షాప్​ లోకి వచ్చింది. కౌంటర్‌పై ఉన్న నగల పెట్టెను ఎవరూ చూడకుండా దుపట్టాలో దాచుకుంది. అనంతరం ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి జారుకుంది. కొద్దిసేపటి తర్వాత నగల బాక్స్​ కనిపించకపోవడంతో యజమాని సీసీటీవీ ఫుటేజీని చూడడంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>