కలం, వలిగొండ : వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో సయ్యద్ రజాక్ ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున భారీ కొండచిలువ (Massive Python) కలకలం సృష్టించింది. రజాక్ ఇంట్లోకి దూరెందుకు ప్రయత్నించగా గ్రామస్తులు కొండచిలువను కొట్టి చంపారు.
శనివారం రాత్రి ఇంటి ముందు ఉన్న పెద్ద కోళ్ల గూటిలోకి ప్రవేశించిన కొండచిలువ రాత్రి రెండు టర్కీ కోళ్లు, నాలుగు చీమ కోళ్లు, నాలుగు నాటు కోళ్లను మింగి వేసింది. కాగా తెల్లవారుజామున ఇంటిలోకి ప్రవేశించే క్రమంలో కొండచిలువ శబ్దం వస్తుండడంతో గమనించిన ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసి కొట్టి చంపారు.

