ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులు.. పారామెడికల్ విద్యార్థిని ఆత్మహత్య!

​కలం, ఖమ్మం బ్యూరో: ప్రేమ, పెళ్లి పేరుతో తోటి విద్యార్థి చేస్తున్న వేధింపులు, తీవ్ర మానసిక హింస భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మం ప్రభుత్వ పారా మెడికల్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి (Paramedical Student Suicide)ని మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఖమ్మం జిల్లా ​కామేపల్లి మండలం కొత్తలింగాల గ్రామానికి చెందిన పాలె యాఫియ (Pale Yafiya) (21) ఖమ్మం ప్రభుత్వ పారా వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.

అదే కళాశాలలో చదువుతున్న సయ్యద్ ఆనాస్ అనే యువకుడు కొద్ది రోజులుగా ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. ​ఈ క్రమంలో అక్టోబర్ 23న కళాశాలకు వెళ్తుండగా ఆనాస్ ఆమెను మళ్లీ వేధించడంతో యాఫియ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ మానసిక హింసను తట్టుకోలేక అక్టోబర్ 27న ఇంట్లోనే ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Paramedical Student Suicide) పాల్పడింది.

కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ​మృతురాలి తండ్రి పాలె నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సయ్యద్ ఆనాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కామేపల్లి ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితుడిపై చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>