పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలి: MRO సునీత

కలం, ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం (Yerrupalem) మండల పరిధిలోని పట్టబద్రులు తమ ఓటు హక్కు కొరకు నవంబర్ 6 తారీకు లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని తహసిల్దార్ సునీత ఎలిజిబెత్ (MRO Sunitha) తెలిపారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులు తమ ఓటును వెంటనే ఆన్లైన్ చేసుకొని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు.

గతంలో ఎమ్మెల్సీ ఓటర్లుగా మండలంలో 1,905 ఓట్లు ఉన్నాయని.. ప్రస్తుతం ఇప్పటివరకు 1,774 మంది ఆన్ లైన్  ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు. మిగిలిన వారు కూడా వెంటనే తమ ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో జ్యోతి, ఆర్ఐలు రవికుమార్, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>