కలం, జోగులాంబ గద్వాల: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు (Gadwal BJP President) రామాంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం కేటిదొడ్డి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు శ్రీపాద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు క్షేత్రస్థాయి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ.. ”బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని అర్హులైన గ్రాడ్యుయేట్లను గుర్తించి, ఓటరుగా ఎలా నమోదు చేసుకోవాలో వారికి అవగాహన కల్పించాలని, ప్రతి అర్హుడైన పట్టభద్రుడు ఓటరుగా నమోదయ్యేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, మండల నాయకులు హానిమి రెడ్డి, ఎర్ర బీమ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

