కలం, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కు ఐపీఎల్‌లో మళ్లీ భారీ డిమాండ్ ఏర్పడింది. 2028 సీజన్ కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు ఆయనను తమ జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ గంభీర్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. మరో రెండు జట్లు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయన కాంట్రాక్ట్ ఉంది.
అయితే, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు బీసీసీఐ ఆయన పదవీకాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో గంభీర్.. లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు మెంటర్‌గా పనిచేశారు. 2022, 2023లో లక్నోను ప్లేఆఫ్స్‌కు చేర్చారు. ఆ తర్వాత 2024లో కేకేఆర్ మెంటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన మార్గదర్శకత్వంలో కేకేఆర్ పదేళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు 2028 సీజన్ కోసం నాలుగు జట్లు ఆయన సేవలను కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే, గంభీర్ (Gautam Gambhir) టీమిండియా కోచ్‌గా కొనసాగుతారా? ఐపీఎల్‌లోకి తిరిగి వస్తారా? అనేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

