ఆదిలాబాద్‌లో వియత్నాం విద్యా విధానాల అమలుకు ప్రణాళిక

కలం, ఆదిలాబాద్: జిల్లా నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వియత్నాం దేశంలో పర్యటించి అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం (Vietnam Education) చేసింది. ఈ పర్యటనలో జిల్లాకు చెందిన గడ్డం శశికళ, కట్ట సుజాత, మద్ది లక్ష్మణ్ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వియత్నాంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి అక్కడ అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, బోధనా విధానాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అక్కడి విద్యా రంగంలో అనుసరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆదిలాబాద్ జిల్లాలోనూ అమలు చేసేందుకు అనువైన అంశాలను గుర్తించి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ వియత్నాం పర్యటన విశేషాలను వివరించారు. అక్కడ పరిశీలించిన విద్యా విధానాలు, జిల్లాలో అమలు చేయడానికి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు అశోక్, లక్ష్మణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Also Read : హరీష్ రావును కాళేశ్వరం గేట్లకు కట్టేసి కొట్టాలి : ఈరవత్రి అనిల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>