చినజీయర్ స్వామి జయంతి వేళ.. పేదలకు నూతన వస్త్రాల పంపిణీ!

‎కలం, సూర్యాపేట: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) వారి తిరునక్షత్ర (జయంతి) మహోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట పబ్లిక్ క్లబ్‌లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్మాది హాజరై పేదలకు సొంత చేతులతో నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో నిరుపేదలకు అండగా నిలవడం, వారికి సేవ చేయడమే నిజమైన దైవసేవ అని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఆలోచనలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం వికాస తరంగిణి సంస్థ నిరంతరం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి తమకు తోచినంతలో పేదలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా పలువురు నిరుపేదలకు వస్త్రదానం చేసి వారి ముఖాల్లో ఆనందం నింపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ప్రతినిధులు, సభ్యులు, స్థానిక నాయకులు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>