ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశాలు

కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి (Additional Collector Ravi) అధికారులను ఆదేశించారు. వరి కోతలు మొదలవుతున్న నేపథ్యంలో కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పించి, రైతుల నుంచి ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, డీఆర్డీఏ, సహకార శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

డీఆర్డీఏ ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్‌, జిల్లా సహకార అధికారి మోహన్‌, డీఆర్డీఏ డీపీఎం రాజేంద్రప్రసాద్‌, సివిల్‌ సప్లైస్‌ డీటీ నాగేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>