కొత్త‌ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి స్థల పరిశీలన

కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) జిల్లాలో నూతనంగా రెండు మండలాలు ఏర్పాటయ్యాయి. మద్దూరు మండలంలో కొత్తగా గుండుమల్, కొత్తపల్లి మండలాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరగలేదు. తాజాగా గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ గుండుమల్ కొత్తపల్లి మండలాల్లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, శాంతిభద్రతల పరిరక్షణను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా స్థలాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో ఆయా గ్రామాలు, పరిసర ప్రాంతాల ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడంతో పాటు, ఫిర్యాదులపై తక్షణ స్పందన, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ సైదులు, ఎస్సై లు విజయ్ కుమార్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>