పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ టాప్: సీఎం రేవంత్

‎కలం, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ టాప్‌లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మీకేం కావాలో చెబితే.. అవి వెంటనే సమకూర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పెట్టుబడిదారులను ఉద్దేశించి పేర్కొన్నారు.

ఢిల్లీలో జరుగుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) మాట్లాడారు. తమ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మాత్రం అందరిదీ ఒకే మాట అన్నారు. మా డీఎన్ఏలోనే పెట్టుబడుల ఆకర్షణలు, సంస్కరణల అమలు ఉన్నాయని వివరించారు. తెలంగాణలో పెట్టే పెట్టుబడులకు తనదీ బాధ్యత అన్నారు. డిసెంబరులో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

కాకతీయుల కాలం నుంచే..

తెలంగాణ ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) అన్నారు. తాండూరు కంది పప్పుకు చాలా గిరాకీ ఉందన్నారు. కాకతీయుల కాలం నుంచే తెలంగాణకు విదేశాలతో ఎగుమతులు జరిగేవన్నారు. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు విదేశీ వర్తకులకు హామీ మోటుపల్లి అభయ శాసనం కూడా వేయించారని గుర్తు చేశారు. దేశ విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని.. తద్వారా దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌(Telangana Global Summit)కు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Also Read : సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం భారీ విజయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>